పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకు ఒక పండగ లాంటిది. పవన్ సినిమాల్లో కథ, మేకింగ్‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరో క్యారెక్టరైజేషన్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎలాంటి పాత్రనైనా తనదైన ఈజ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో ఒక రేంజ్‌కి తీసుకెళ్ళే పవన్, ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు కూడా తనదైన టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ ఓ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు.
గబ్బర్ సింగ్ సినిమాలోని క్యారెక్టరైజేషన్‌ను ప్రేరణగా తీసుకొని ఓ కొత్త కథతో సర్దార్ గబ్బర్ సింగ్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విషయంలో పవన్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ పూర్తి స్థాయి హీరోగా నటించిన సినిమా ఏదీ విడుదల కాకపోవడంతో పవన్ అభిమానులు సర్దార్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ తనదైన కామెడీ టచ్ ఇచ్చి, స్టైలిష్ మ్యానరిజమ్‌తో పాత్రను పండిస్తున్నారట. శరత్ మరార్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తున్నారు.


