ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, మహేష్ బాబు?

ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, మహేష్ బాబు?

Published on Feb 13, 2015 3:00 PM IST

Pawan-Kalyan-Mahesh-Babu
తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే వేదికను అలంకరించనున్నారు. వీరిద్దరూ అల్లు అర్జున్ నటిస్తున్న ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమా ఆడియో ఫంక్షన్ ని ముఖ్యఅతిధులుగా రానున్నారని సమాచారం. వీరిరువురినీ ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. మహేష్, పవన్ లతో త్రివిక్రమ్ కి మంచి సాన్నిహిత్యం వున్న కారణాన ఇలాంటి సంఘటన జరగనుందని తెలుస్తుంది.

గతంలో ఇలానే ‘మేము సైతం’ వేడుకలో ఒక టాక్ షో మహేష్, పవన్ లు పాల్గుంటారని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. మరి ఈసారైనా వీరి కలయిక అభిమానులకు కనులవిందుగా మారుస్తుందో లేదో చూడాలి.

తాజా వార్తలు