ట్విట్టర్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్

ట్విట్టర్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్

Published on Jan 2, 2015 10:36 AM IST

pawnan-kalyan-twitter
ప్రస్తుతం తెలుగు సినీ ప్రపంచంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఓ సంచలనం.. అందుకే ఇండస్ట్రీలో చాలా మంది తమ సినిమాల్లో ఆయన పేరుని విచ్చల విడిగా వాడేసుకుంటున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ తన అభిమానులతో డైరెక్ట్ గా టచ్ లో ఉండడం కోసం సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారు. న్యూ ఇయర్ కానుకగా నిన్న సాయంత్రం ఆయన ట్విట్టర్ లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు.

పవన్ కళ్యాణ్ వేసిన మొదటి ట్వీట్ ‘మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ శాంతి, ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని’ ట్వీట్ చేసాడు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లోకి ఎంటర్ అవ్వడంతో ఇందాస్త్రీలోని సెలబ్రిటీలు అందరూ ఆయనకి సోషల్ నెట్వర్క్ లోకి స్వగతం పలికారు. అలాగే అభిమానులు ఎంతో అనడంతో #PawanKalyanOnTwitter అంటూ ఇండియాలో ట్రెండ్ చేస్తున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లోకి ఎంటర్ అయిన 15 గంటల్లోనే పవన్ కళ్యాణ్ కి 56 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. మీరు కూడా పవన్ కళ్యాణ్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే @PawanKalyan ఐడిని ఫాలో అవ్వండి.

పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కలిసి నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

pawan-twitter

తాజా వార్తలు