ప‌వ‌న్ కళ్యాణ్ – బోయపాటి కాంబినేషన్ లో ?

Published on May 29, 2019 1:30 am IST

పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కి తను పరమ భక్తుడ్ని అని చెప్పుకునే బండ్ల గ‌ణేష్, ఎట్టకేలకూ పవర్ స్టార్ ను మళ్లీ వెండితెర మీదకు తీసుకురావడానికి ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఓ స్టార్ డైరెక్టర్ ను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఎలాగూ కాంబినేషన్ లను సెట్ చేసి.. సినిమాలను తీయడంలో బండ్లకు బట్టర్ తో పెట్టిన విద్య. ఇప్పుడు ఆ విద్యనే వాడుకుంటున్నాడని సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది.

ఇంతకీ మ్యాటర్ లోకి వెళ్తే.. ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ – బోయపాటి కాంబినేషన్ లో బండ్ల గ‌ణేష్ సినిమా ప్లాన్ చేసాడట. కానీ పవన్ ఇప్పటికే సినిమాలు చేయనని ప్రకటించేశాడు. అయితే బండ్ల మాత్రం తన వంతుగా తన ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఆ క్రమంలోనే సినిమా అంగీకరిస్తే పవర్ స్టార్ కి 40 కోట్ల రూపాయ‌ల‌ రెమ్యునేష‌న్ ఇచ్చుకుంటానని చెప్పుకొచ్చాడట.

అదేవిధంగా బోయపాటి శ్రీనుకి కూడా 10 కోట్ల రూపాయ‌లు సమర్పించుకోగలనని ప్రకటించాడట. రెమ్యున‌రేష‌న్ ల రూపంలో 50 కోట్లు పోగా ఎలాగోలా సినిమాను మరో 50కోట్ల‌లో పూర్తి చేసేసి.. మొత్తానికి సినిమాను 150 కోట్లకు బిజినెస్ చేసుకోవచ్చు అని మనోడి ప్లాన్. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా.. ఏమో బండ్లకే తెలియాలి.

సంబంధిత సమాచారం :

More