పవన్‌కు ఇక రెస్ట్ దొరకదు

Published on Mar 10, 2020 1:39 am IST

పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రావడంతోనే మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన ఇంకొన్ని చిత్రాలకు సైన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’, క్రిష్ చిత్రాల షూటింగ్లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్న ఆయన మార్చ్, ఏప్రిల్ నెలల్లో మరింత బిజీ కానున్నారు. ఎందుకంటే ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేయాలి, ఆ వెంటనే హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ చేయాలి కాబట్టి.

మొత్తానికి ఈ యేడాది మూడు సినిమాల టార్గెట్ పెట్టుకున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వాటికి సంబంధించిన పనుల్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో.. రానున్న రెండు నెలల్లో ఒక్కరోజు కూడా గ్యాప్ తీసుకోకుండా పనిచేసేలా పవన్ ప్రణాళిక వేసుకున్నారట. ఇకపోతే తాజాగా ‘వకీల్ సాబ్’ నుండి విడుదలైన మొదటిపాట ‘మగువ మగువ’ మంచి ఆదరణ దక్కించుకుంటుండగా టీజర్ ఉగాదికి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More