అలీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి – పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan

ప్రముఖ హాస్యనటుడు అలీకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి జైతున్‌ బీబీ అనారోగ్యంతో స్వస్థలం రాజమహేంద్రవరంలో కన్నుమూశారు. అలీ కుటుంబానికి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘అలీ మాతృమూర్తి జైతున్‌ బీబీ తుది శ్వాస విడిచారని తెలిసి చాలా బాధ అనిపించింది. బీబీగారు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. అలీకి తల్లితో ఉన్న అనుబంధం ఎంతో బలమైనదో తెలుసు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’ అని ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

మాతృమూర్తి పై ఉన్న ప్రేమను అలీ వివిధ సందర్భాల్లో తరచూ గుర్తు చేసుకునేవారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి తల్లితండ్రులే కారణమని చెప్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా ఆమెతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడేవారు. మరోవైపు ఇప్పటికే అలీ తన తండ్రిపేరిట సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. జైతున్‌ బీబీ అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరగనున్నాయి.

123తెలుగు.కామ్ తరఫున ‘జైతున్‌ బీబీ’ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Exit mobile version