ఆ సెంటిమెంట్ పవన్‌కి ఇక్కడ వర్కౌట్ అయ్యేనా?

Published on Dec 22, 2020 1:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో, సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా, సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ సినిమా పూజా కార్యక్రమాలు నేడు ప్రారంభమయ్యాయి. అయితే తాజాగా చేస్తున్న ఈ సినిమాకి పవన్ దేవుళ్ల ఫోటోలపై క్లాప్ కొట్టారు. 2012లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం లాంచ్ సమయంలో కూడా పవన్ ఇలానే దేవుళ్ల ఫోటోలపైనే క్లాప్ కొట్టారు. ఆ సినిమాకు త్రివిక్రమ్ కెమెరా స్విచ్చాన్ చేసారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికి తెలిసిందే.

అయితే ఇప్పుడు అదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ పవన్ కళ్యాణ్ దేవుళ్ల ఫోటోలపై క్లాప్ కొట్టగా, త్రివిక్రమ్ కెమెరా స్విచ్చాన్ చేసారు. ఇక హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్టు ని నిర్మాతలకు అందించారు. అయితే అత్తారింటికి దారేది సినిమాకు వాడిన సెంటిమెంట్ ఈ సినిమాకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :