వేలం వేయనున్న పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ బైక్

వేలం వేయనున్న పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ బైక్

Published on Dec 31, 2014 2:46 PM IST

Gopala-Gopala-Second-Poster

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మాలీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ శ్రీ కృష్ణుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం ఓ స్పెషల్ బైక్ ని డిజైన్ చేసారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఈ బైక్ పైన వచ్చే స్టిల్ ని కూడా రిలీజ్ చేసారు. కావున ఆ బైక్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ప్రతి సినిమాలోనూ హీరో వాడిన వస్తువులను వేలం వేస్తుంటారు. అదే బాటలోనే ‘గోపాల గోపాల’లో పవన్ కళ్యాణ్ వాడిన బైక్ ని కూడా వేలం వెయ్యడానికి ఈ చిత్ర టీం నిర్ణయించుకున్నారు. సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యాక బైక్ ని రిలీజ్ ముందు వేలం వెయ్యాలా లేక సినిమా రిలీజ్ అయిన తర్వాత వేలం వెయ్యాలా అనే విషయంపై ఈ చిత్ర టీం నిర్ణయం తీసుకోనున్నారు.

గోపాల గోపాల ఆడియో జనవరి 1న హైదరబాద్ లోని శిల్పకళా వేదికలో జరగనుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాకి డాలీ డైరెక్టర్.

తాజా వార్తలు