పవన్ ఫ్యాన్స్ కి కిక్.. వైరల్ అవుతోన్న బండ్ల స్పీచ్ !

Published on Apr 5, 2021 10:02 am IST

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ వకీల్ ‌సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత బండ్ల గణేశ్ ప్రత్యేక అతిధిగా హాజరయి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ బండ్ల గణేష్ ఏం మాట్లాడాడు అంటే.. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. ‘‘నిజంగా పవన్‌ కళ్యాణ్ ఒక వ్యసనం. ఒకసారి అలవాటు చేసుకుంటే.. చనిపోయి బూడిద అయ్యే వరకూ మనం వదల్లేం. హీరో గురించి మాట్లాడాలంటే.. ఓ ఐపీఎస్ వద్దకు వెళ్లి మీరు టెన్త్ క్లాస్‌ బాగా పాస్ అయ్యారు అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే ఆయన చూడని బ్లాక్‌బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, చరిత్రలు లేవు.

ఆయన కొత్త శకం, కొత్త నాందికి శ్రీకారం చుట్టాడు. నేను చాలాసార్లు పవన్‌ కళ్యాణ్‌కి అబద్ధం చెప్పి మోసం చేద్దామని అనుకున్నా. కానీ ఆయన కళ్లలోకి చూసిన వెంటనే అలా చేయడం నా వల్ల కాదు. అయన కళ్లలో అంత నిజాయతీ ఉంటుంది. వెంకన్నకు అన్నమయ్య, శివుడికి భక్త కన్నప్ప, రాముడికి హనుమంతుడిలా నేను పవన్ కళ్యాణ్‌కి భక్తుడినని సగర్వంగా చెప్పుకుంటున్నాను’’ అంటూ బండ్ల ఇచ్చిన స్పీచ్ పవన్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది.

సంబంధిత సమాచారం :