‘గోపాల గోపాల’ కోసం బాగా టైం తీసుకుంటున్న పవన్ కళ్యాణ్

‘గోపాల గోపాల’ కోసం బాగా టైం తీసుకుంటున్న పవన్ కళ్యాణ్

Published on Jul 6, 2014 9:48 PM IST

pawan_kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మై గాడ్ రీమేక్ ‘గోపాల గోపాల’ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి మనకందరికీ తెలిసిందే. అనుకున్న దాని ప్రకారం ఇప్పటికే పవన్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వాలి. కానీ ఇంకా షూటింగ్ లో జాయిన్ కాలేదు. ఎందుకంటే పవన్ తన పాత్ర విషయంలో ఎక్కువ టైం తీసుకుంటున్నాడు.

పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దేవుడి పాత్రలో కనిపించాలి. తన పాత్రని బాగా సీరియస్ గా తీసుకున్న పవన్ తన లుక్ మరియు డైలాగ్స్ విషయంలో మరింత ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఈ చిత్ర టీం విక్టరీ వెంకటేష్, మిగతా నటీనటులపై వచ్చే సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాని అక్టోబర్ చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

కిషోర్ పార్ధసాని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు