పవన్ గత ఐదేళ్ల సంపాదన వివరాలు.!

పవన్ గత ఐదేళ్ల సంపాదన వివరాలు.!

Published on Apr 23, 2024 4:29 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలు అన్నీ పవన్ ఎన్నికలు అయ్యిన తర్వాత మళ్ళీ రీ స్టార్ట్ కానున్నాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న హీరోస్ లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. రోజుకు రెండు 2 కోట్ల రెమ్యునరేషన్ అయినా కూడా ఇచ్చేందుకు ఇప్పుడు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

దీనితో పవన్ పారితోషికం మన తెలుగులో అత్యధిక మొత్తంలో తీసుకుంటున్న అతి కొద్ది మంది హీరోస్ లో తాను ఒకడిగా నిలిచారు. అయితే పవన్ కళ్యాణ్ గడిచిన ఐదేళ్లలో ఎంత సంపాదించారు? ఎంత పన్ను రూపంలో చెల్లించారు అనేది ఇప్పుడు రివీల్ అయ్యింది. అయితే పవన్ గత 5 ఏళ్లలో 114.76 కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా తన పి ఆర్ టీం నుంచి అప్డేట్ బయటకి వచ్చింది.

ఇక ఈ ఐదేళ్లలో మొత్తం 73.92 కోట్ల రూపాయలు పన్నులు చెల్లించగా 20 కోట్లకి పైగా మొత్తం విరాళాలు అందించినట్టుగా తెలిపారు. ఇక వీటితో పాటుగా పవన్ కి వివిధ బ్యాంకుల నుంచి అలాగే కొందరు వ్యక్తుల నుంచి అప్పులు 64.26 కోట్లు రూపాయలు అప్పులు ఉన్నాయట. సో ఈ ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ పొందిన, వెచ్చించిన లెక్కలు ఇలా ఉన్నాయి. బహుశా ఈ సంపాదనలో “ఓజి”, “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాల నిర్మాతల నుంచే ఈ కొన్ని నెలల్లోనే ఎక్కువ వచ్చి ఉండొచ్చు. లేకపోతే ఈ 114 కోట్ల కంటే తక్కువే ఉండేది ఏమో..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు