అందులో మహేష్ టాప్ అయితే.. ఇందులో పవన్ టాప్

Mahesh Pawan

తెలుగు స్టార్ హీరోల్లో నిత్యం పోటీపడేవారు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. కలెక్షన్ల దగ్గర్నుండి సోషల్ మీడియా అంశాల్లో వీరే టాప్ పొజిషన్లో ఉంటూ వస్తుంటారు. తాజాగా ట్విట్టర్ 2020లో జరిగిన పలు అంశాల మీద డీటైల్డ్ రిపోర్ట్స్ విడుదలచేశాయి. వాటిలో కూడ మహేష్, పవన్ పోటీపడ్డారు. 2020లో ట్విట్టర్లో నెటిజన్లు ఎక్కువగా ఏ సౌత్ హీరో గురించి ట్వీట్స్ చేశారు అనే విషయంలో మహేష్ బాబు టాప్ పొజిషన్లో ఉన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విజయం గురించి, మహేష్ కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’, ఇతర అంశాల మీద నెటిజన్లు మహేష్ బాబు గురించే ఎక్కువ ట్వీట్లు చేశారట. ఈ జాబితాలో రెండవ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉండగా మూడవ స్థానంలో తమిళ హీరో విజయ్ ఉన్నారు.

ఇక నెటిజన్లు అధికంగా చర్చించుకున్న, ట్వీట్లు చేసిన సౌత్ సినిమాల జాబితాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ ముందుండగా మహేష్ బాబు యొక్క ‘సర్కారు వారి పాట’ నాల్గవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో విజయ్ యొక్క ‘మాస్టర్’ ఉండగా మూడవ స్థానంలో అజిత్ చేస్తున్న ‘వాలిమై’ చిత్రం నిలిచింది. మొత్తానికి హీరోల మీద ట్వీట్లు అనే అంశంలో మహేష్ బాబు ముందుండగా సినిమాల గురించిన అత్యధిక ట్వీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. లాక్ డౌన్ లేకుండా ఉంటే పవన్ యొక్క ‘వకీల్ సాబ్’ విడుదలయ్యేది. అలాగే మహేష్ యొక్క ‘సర్కారు వారి పాట’ షూట్ దాదాపుగా పూర్తయ్యేది. కానీ కుదరలేదు. అయితే వచ్చే ఏడాదిలో మాత్రం ఒక్కొక్కరి నుండి రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Exit mobile version