కబీర్ సింగ్ కల నెరవేర్చిన పవన్ కళ్యాణ్ ‘సర్దార్’

kabir-and-pawan
టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ నటించిన ‘జిల్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆరడుగుల భారీ కటౌట్ కబీర్ దుహన్ సింగ్. మొదటి సినిమాతోనే తన లుక్ మరియు పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న కబీర్ సింగ్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్నాడు. ఇప్పటికే కిక్ 2 లో కనిపించిన కబీర్ అజిత్ 56వ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా కబీర్ కలలు కన్న డ్రీమ్ నిజమైంది. దాంతో తన ఆనందానికి అవధులు లేవు. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం రావడం.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ సినిమాలో మెయిన్ విలన్స్ లో ఒకరుగా కబీర్ సింగ్ ని ఫైనలైజ్ చేసారు. ఈ విషయం పై కబీర్ సింగ్ స్పందిస్తూ ‘పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఆఫర్ రావడం నేనింకా నమ్మలేకపోతున్నాను. నా కల నిజమైంది. సర్దార్ గబ్బర్ సింగ్ లో నేను ఓ విలన్ గా కనిపిస్తాను. నేను పవన్ కళ్యాణ్ గారితో కలిసి చేసే ఫస్ట్ షెడ్యూల్ త్వరలోనే మొదలవుతుంది. ఆ మోమెంట్ కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నానని’ తెలిపాడు. కెరీర్ ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేయడం సూపర్బ్ లక్ ని చెప్పాలి.

పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి పవర్ ఫేం బాబీ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో కలిసి శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version