
మాస్ మహారాజ్ రవితేజని ‘పవర్’ గా చూపించిన డైరెక్టర్ బాబీ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గా చూపించే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ చిత్ర టీం ఓ షార్ట్ షెడ్యూల్ కోసం గుజరాత్ వెళ్లి వచ్చారు. హైదరాబాద్ వచ్చి షార్ట్ గ్యాప్ తీసుకున్న ఈ చిత్ర టీం హైదరబాద్ లో మరో కొత్త షెడ్యూల్ ని స్టార్ చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్, అలీ కాంబినేషన్ సీన్స్ తో పాటు, ముఖేష్ రుషిపై వచ్చే కొన్ని సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ అలీతో అరే సాంబ రాసుకోరా అనే ఎపిసోడ్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. అదే తరహాలో అలాంటి కాంబినేషన్ సీన్స్ ఈ సినిమాలో కూడా ఉంటాయని ఈ చిత్ర టీం తెలిపింది. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో రాయ్ లక్ష్మీ ముఖ్య పాత్రలో కనిపించడమే కాకుండా ఓ స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించనుంది. ఇటీవలే ఆ సాంగ్ ని కూడా షూట్ చేసేసారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హైదరాబాద్ షార్ట్ షెడ్యూల్ తర్వాత ఓ లాంగ్ షెడ్యూల్ కోసం ఈ చిత్ర టీం రాజస్థాన్ వెళ్లనున్నారు.

