పవన్ కళ్యాణ్ – సర్దార్..

Pawan_kalyan
ఫిల్మ్ ఛాంబర్ లో కొత్తగా రిజిస్టర్ అయిన ‘సర్దార్’ టైటిల్ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులలో ఆసక్తి రేపింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ టైటిల్ రిజిస్టర్ చేయించడమే ఇందుకు కారణం.

దాసరి నారాయణరావు – పవన్ కళ్యాణ్ కలయికలో తెరకేక్కబోయే సినిమా కోసం ‘సర్దార్’ టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు ప్రచారం జరుగుతుంది. 1980లలో ఎన్టీఆర్ హీరోగా దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. క్రేజీ కాంబినేషన్లో హిట్ సెంటిమెంట్ టైటిల్ కావడంతో అంచనాలు ఏర్పడుతున్నాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా పూర్తవడానికి కనీసం ఓ ఐదారు నెలలు అయినా పడుతుంది. ఈలోపు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version