స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్లుగా పవన్ కళ్యాణ్, నితిన్, అమల..

స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్లుగా పవన్ కళ్యాణ్, నితిన్, అమల..

Published on Jan 5, 2015 2:31 PM IST

pawan-amala-nithin

జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లను కేంద్రం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుండి ఆధ్యాత్మిక, క్రీడా, సినీ రంగాలకు చెందిన మొత్తం 18 మంది ప్రముఖల పేర్లను ప్రకటించగా.. సినీ తారలకు మంచి ప్రాముఖ్యత లభించింది.

తెలుగు చిత్ర పరిశ్రమ నుండి దర్శ కేంద్రుడు కె.రాఘవేంద్ర రావు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అక్కినేని అమల, హీరో నితిన్, గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజలు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమితులయ్యారు. వీరి పేర్లను నేడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రజలలో అవగాహనా కల్పించాలని కోరారు.

తాజా వార్తలు