పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన నటించిన పలు యాక్షన్ చిత్రాల్లో దర్శకుడు విష్ణు వర్ధన్ తెరకెక్కించిన స్టయిలిష్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా పంజా కూడా ఒకటి. అప్పట్లో భారీ డిజాస్టర్ అయ్యిన ఈ సినిమా మళ్లీ 11 ఏళ్ల తర్వాత పవన్ పుట్టినరోజు కనుకగా విడుదల చేస్తే భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఈ రీ రిలీజ్ లో పంజా చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 5.12 కోట్ల గ్రాస్ తో అదరగొట్టింది. అయితే 2011 లో అప్పటి పరిస్థితులుకి సినిమా 8 కోట్ల గ్రాస్ కి పైగా రాబట్టినట్టు టాక్. మళ్లీ అప్పటి నుంచి ఇప్పటికీ కేవలం 3 కోట్ల డిఫరెన్స్ తో ఓపెనింగ్స్ రాబట్టడం పవన్ క్రేజ్ ని ప్రూవ్ చేస్తుంది. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అలాగే సారా జేన్ డయాస్ హీరోయిన్ గా నటించింది. బ్రహ్మానందం, జాకీ ష్రాఫ్, అడివి శేష్ అలీ తదితరులు ఈ సినిమాలో నటించారు.


