ఉపరాష్ట్రపతి కోవిడ్ నుంచి కోలుకోవాలని పవన్..!

Published on Sep 30, 2020 11:03 am IST

ఇప్పుడు మన దేశ వ్యాప్తంగా కరోనా మూలాన ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదకారి వైరస్ బారిన సినీ ప్రముఖులు సహా జాతీయ స్థాయి అగ్ర రాజకీయ నాయకులు కూడా పడుతున్నారు. అలా మన దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా కోవిడ్ బారిన పడ్డానని ఇటీవలే తెలిపారు. తాను కరోనా టెస్టు చేయించుకొగా అందుకు తనకు పాజిటివ్ వచ్చిందని వార్త రావడంతో అనేక మంది ప్రముఖులు తమ స్పందనను తెలియజేసారు.

అలాగే మన టాలీవుడ్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వెంకయ్య నాయుడు గారి ఆరోగ్యంపై ట్వీట్ చేసారు. “మన భారత దేశ – గౌరవ ఉప రాష్ట్రపతి ‘శ్రీ వెంకయ్య నాయుడుగారు ‘ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాను.” అని ట్వీట్ చేసి తన స్పందనను తెలియజేసారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న “వకీల్ సాబ్” షూట్ పునః ప్రారంభం కాగా ఆ షూట్ కోసం రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :

More