పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో మళ్లీ పవర్ స్టార్ ?

puri pawan

పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ నటించబోతున్నారా ? గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో బద్రీ, ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పూరీ గతంలో మహేష్ బాబుతో చేయాలనుకున్న ఈ సినిమాను పవన్‌తో చేయనున్నాడట. పూరి మదిలో వున్న ‘జనగనమణ’ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసి, పూరి పవన్ కి వినిపించాలనుకుంటున్నాడని.. ఆ మధ్య బాగా వార్తలు వినిపించాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కు పూరి ఈ కథను వినిపించాడు.

కాగా పవన్ కళ్యాణ్ కి కథ బాగా నచ్చిందని 2022లో వీరి కలయికలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. అన్నట్టు భారత దేశంలో అవినీతి జాఢ్యం నేపథ్యంలో ఈ జనగనమణ కథను పూరి రాస్తున్నాడట. అంటే ఈ కథ మొత్తం మన వ్యవస్థలో లోపాల చుట్టూ, అలాగే మన న్యాయ వ్యవస్థలోని డొల్లతనం చుట్టూ కథ సాగుతుందట. ఇక ఈ కరోనా టైమ్ లో సినిమా దర్శకులుకు కొత్త కథలు రాసుకోవడానికి మంచి అవకాశం.. అందుకే ఇప్పటికే చాలామంది దర్శకులు తమ తరువాత సినిమాల కథలను పూర్తి చేశారు.

Exit mobile version