పవన్ అలా కనిపించి అభిమానులలో ఆశలురేపుతున్నాడా…!

పవన్ అలా కనిపించి అభిమానులలో ఆశలురేపుతున్నాడా…!

Published on Jul 5, 2019 8:08 AM IST

జనసేన అధినేత పవన్ గెలుపోటములను ప్రక్కన పెట్టి,ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయన తరచుగా మండల స్థాయి,జిల్లా స్థాయి నేతలతో సమావేశమవుతూ కనీసం త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలోనైనా జనసేన విజయం సాధించేలా గట్టి చర్యలు చేపడుతున్నారు. ఐతే పవన్ కళ్యాణ్ అభిమానులలో కొందరు మాత్రం ఆయన మళ్ళీ సినిమా చేస్తే చూడాలని తహతహలాడుతున్నారు. కానీ పవన్ ఇక సినిమాలవైపు వెళ్ళేది లేదు,ప్రజా క్షేత్రంలో ఉంది సమస్యలపై పోరాటం చేస్తాం అని ఖరాఖండీగా చెప్పేశారు.

ఎన్నికల సమయంలో అలాగే ఆతరువాత కూడా పవన్ బాగా పెరిగిన గడ్డం, తెల్లని లాల్చీ,పైజమా ధరించి పూర్తి స్థాయి పొలిటిషన్ గా మారిపోయారు. కానీ రీసెంట్ గా ఆయన లుక్ చూసిన అభిమానులకు మళ్ళీ హీరోగా చూడాలన్న ఆశ కలుగకమానదు. ట్రిమ్ చేసిన గడ్డం,నెక్ టి షర్ట్, జీన్ ప్యాంటులో ఆయన సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. పవన్ పూర్తిగా సినిమాలు వదిలేయడం ఆయన అభిమానుల్లో కొందరు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభిమాన హీరోని తెరపైన చూసి పూలు జల్లి,ఈలలు వేసే అవకాశం ఇక ఎప్పటికీ లేదని చింతిస్తున్నారు. ఇటీవల నాగబాబు పవన్ పూర్తి స్థాయి హీరోగా కనిపించకపోయినా అతిథి పాత్రలు చేసే అవకాశం కలదు అని చూచాయిగా చెప్పారు. మరి అలా మెగా హీరోల సినిమాలలో అతిథిగా కనిపించైనా అలరిస్తాడేమో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు