చెర్రీకి డాక్టరేట్ రావడంపై పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్.!

చెర్రీకి డాక్టరేట్ రావడంపై పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్.!

Published on Apr 12, 2024 1:55 PM IST


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలు లైనప్ లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాలతో పాటుగా తాను తాజాగా గౌరవ డాక్టరేట్ అందుకున్న వార్తలు కూడా వైరల్ గా మారాయి. అయితే ఇది నిజమే అని ఖరారు కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే తాజాగా రామ్ చరణ్ కి డాక్టరేట్ రావడంపై తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు.

ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి “చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ కి డాక్టరేట్ రావాడం ఎంతో ఆనందం కలిగించింది అని అలాగే రామ్ చరణ్ కి తన మనస్పూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను అని ఈ డాక్టరేట్ స్ఫూర్తితో రామ్ చరణ్ మరిన్ని విజయవంతమైన సినిమాలు చేసి పురస్కారాలు, జనాదరణ అందుకోవాలని” ఆకాంక్షిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ తన ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసారు.

దీనితో ఇది బాబాయ్ అబ్బాయి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ “గేమ్ చేంజర్” లో బిజీగా ఉండగా పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాల్లో ఎన్నికల అనంతరం జాయిన్ కానున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు