రీ-రిలీజ్‌కు రెడీ అవుతున్న పవర్ స్టార్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ మూవీ ‘పంజా’.. ఎప్పుడంటే..?

రీ-రిలీజ్‌కు రెడీ అవుతున్న పవర్ స్టార్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ మూవీ ‘పంజా’.. ఎప్పుడంటే..?

Published on May 23, 2026 11:54 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కల్ట్ క్లాసిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పంజా’ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో అభిమానుల కోలాహలం మధ్య ‘పంజా’ రీ-రిలీజ్ స్పెషల్ పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.

విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ‘పంజా’ సినిమాకు అప్పట్లో ఆశించిన స్థాయిలో కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేకపోయినా.. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్, యువన్ శంకర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు మేకింగ్ పరంగా ఇది అభిమానుల్లో ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ పీక్స్ లో ఉన్న తరుణంలో వస్తున్న ఈ రీ-రిలీజ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రాజమండ్రిలో జరిగిన ఈ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలను థియేటర్లలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు అప్పుడే ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 2న రీ-రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించి, ఘన విజయం సాధించాలని చిత్ర వర్గాలు మరియు ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు