డబ్బింగ్ మొదలుపెట్టిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’.. పవర్‌ఫుల్ డైలాగులు లోడింగ్..!

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా అభిమానులు ఫాలో అవుతున్నారు.

అయితే, తాజాగా ఈ చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. పూజా కార్యక్రమంతో ఈ డబ్బింగ్ వర్క్‌ను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో దర్శకుడు హరీష్ శంకర్ కొన్ని పవర్‌ఫుల్ డైలాగులు రాశాడని.. అవి థియేటర్లలో విజిల్స్ వేయించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి తనదైన స్వాగ్ చూపించబోతున్నారు. అందాల భామలు శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version