పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి ల మూవీ కాన్సెప్ట్ అదే – వక్కంతం వంశీ

పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి ల మూవీ కాన్సెప్ట్ అదే – వక్కంతం వంశీ

Published on Dec 7, 2023 3:00 AM IST


తొలిసారిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన రైటర్ వక్కంతం వంశీ, తొలి మూవీతోనే మంచి విజయం అందుకున్నారు. అనంతరం హీరో నితిన్ తో తాజాగా ఆయన తెరకెక్కించిన మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా దీనిని డిసెంబర్ 8న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. శ్రేష్ట్ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ మూవీకి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.

ఇక ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా ఒక మీడియా ఛానల్ వారి ఇంటర్వ్యూలో డైరెక్టర్ వక్కంతం వంశీ మాట్లాడుతూ, తమ టీమ్ మొత్తం కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కోసం ఎంతో కష్టపడ్డారని, తప్పకుండా మూవీ అందరి అంచనాలు అందుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేసారు. ఇక త్వరలో పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న మూవీ సోషల్ సెటైరికల్ కాన్సెప్ట్ గా తెరకెక్కనుందని అన్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలానే పవన్ ఫ్యాన్స్ ని అలరించేలా స్క్రిప్ట్ సిద్ధం అవుతోందని, తప్పకుండా అది కథకుడిగా తనకు మరింత మంచి పేరు తెచ్చుపెడుతుందనే నమ్మకం ఉందని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు