టి.డి.పి, బి.జె.పి లకు మద్దతుగా తెలంగాణాలో పర్యటించనున్న పవన్

pawan-kalyan
టి.డి.పి, బి.జె.పి మద్దతు తెలుపుతూ ఈ నెల అంతా తెలంగాణా లో ప్రచారం చేసే పనిలో పవన్ వున్నాడు. పవర్ స్టార్ హైదరాబాద్ లో జరిగిన సభలో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీలతో వేదికను పంచుకున్నారు. నిన్న పవన్ చంద్రబాబు ని ప్రత్యేకంగా కలిసి భవిష్యత్ ప్రణాళికని చర్చించారు

జనసేన పార్టీకార్యాలయం నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ నెల 25నుండి 28వరకూ విరివిగా పవన్ ప్రచారం చేయనున్నారు. ఈ బిజీ షెడ్యూల్ లో ఆయన మోడీ ఇచ్చిన హెలికాప్టర్ ని వాడనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో ముఖ్య ప్రాంతాలే కాక కల్వకుర్తి, పాలకుర్తి, సిరిసిల్ల, రామగుండం, షాద్ నగర్, ఎల్లా రెడ్డి, కామారెడ్డి, హుసునాబాద్ ప్రాంతాలలో పర్యటించనున్నారు

తెలంగాణా, ఆంద్ర ప్రదేశ్ విడివిడిగా అభివృద్ధి జరగాలంటే టి.డి.పి, బి.జె.పిలు కలిసి అధికారంలోకి రావాలని అందరి ఆకాంక్ష

Exit mobile version