సెప్టెంబర్లో ప్రారంభం కానున్న పవన్ – త్రివిక్రమ్ మూవీ

సెప్టెంబర్లో ప్రారంభం కానున్న పవన్ – త్రివిక్రమ్ మూవీ

Published on Aug 13, 2012 11:30 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న చిత్రానికి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవలే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నానని చెప్పారు. ఇప్పటి వరకూ తను చేయని ఒక కొత్త రకమైన సినిమా చేయనున్నానని త్రివిక్రమ్ అన్నారు. ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. ప్రస్తుతం పవన్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత సెప్టెంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమా మొదలవుతుంది. ‘జల్సా’ తర్వాత త్రివిక్రమ్ – పవన్ కాంబినేషన్లో రానున్న ఈ చిత్రం పై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. పవన్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో హిట్ కొట్టి ఊపు మీదున్నారు మరియు పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రానికి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అలాగే గత వారం విడుదలైన ‘జులాయి’ చిత్రం ద్వారా హిట్ కొట్టి త్రివిక్రమ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు