గంటల్లోనే.. ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ రికార్డు

గంటల్లోనే.. ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ రికార్డు

Published on Jan 3, 2015 11:01 AM IST

pawan-twitt

సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. కొత్త ఏడాది జనవరి 1వ తేదిన పవన్‌ కళ్యాణ్‌ తన ట్విట్టర్‌ ఖాతాను ప్రారంభించారు. ‘నేను భారతీయుడిని. మన మాతృభూమికి సంరక్షకుడిగా ఉంటాను. అంటూ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ ట్వీట్‌ చేశారు. పవన్ సోషల్ మీడియాలో అడుగు పెట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. స్టార్ హీరోకి స్వాగతం పలుకుతూ మెసేజ్ పోస్ట్ చేయడం ప్రారంభించారు.

పవన్ అంటేనే ఓ పవరు. ఈ స్టార్ హీరో ఏం చేసినా సంచలనమే. సినిమాలతో పాటు ట్విట్టర్‌లో కూడా సంచలనం సృష్టించారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో ఖాతా తెరిచిన కొన్ని గంటల్లోనే ఆయన్ను ఫాలో అయ్యే వారి సంఖ్య నిముషం నిముషానికి పెరిగింది. 24 గంటల్లో 91 వేల మంది పవన్ ను ఫాలో అయ్యారు. ప్రస్తుతం లక్ష మంది ఫాలోయర్లు పవన్ ఖాతాను ఫాలో అవుతున్నారు.

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంటు : https://twitter.com/PawanKalyan

తాజా వార్తలు