పవన్ క్వారంటైన్ లో ఉన్నా పని చేసున్నారు !

Published on Apr 11, 2021 4:30 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం ‘వకీల్ సాబ్’ థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. పవన్ వ్యక్తిగత సిబ్బంది, ముఖ్య కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బందిలో పలువురు కరోనా బారిన పడటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా, డాక్టర్ల సూచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పవన్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అయితే పవన్ క్వారంటైన్ లో ఉన్నా రోజూవారీ విధులను, పార్టీ కార్యక్రమాలను టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారట.

ఇక వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కరోనా భయాన్ని లెక్కచేయలేదు. ‘వకీల్ సాబ్’ థియేటర్లకు పోటెత్తున్నారు. దాదాపు అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రతిచోటా పండుగ వాతావరణం నెలకొంది. మామూలు రోజుల్లో ఎలాగైతే పవన్ సినిమాకు హడావుడి ఉంటుందో ఈరోజు కూడా అలానే ఉంది. మొత్తానికి పవన్ మేనియా ముందు కరోనా భయం పెద్దగా పనిచేయలేదు.

సంబంధిత సమాచారం :