పవన్ కళ్యాణ్ ఈసారి సీమ ట్రీట్ ఇస్తారన్నమాట

pawan rana

ప్రజెంట్ పవన్ కళ్యాణ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ చేస్తున్నారు. ఇందులో దగ్గుబాటి రానా ఒక కీలక పాత్ర చేస్తున్నారు. పవన్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ హిట్ దిశగా దూసుకుపోతుండటంతో ఈ రీమేక్ మీద ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇందులో పవన్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన రాయలసీమ యాసలో మాట్లాడతారని తెలుస్తోంది. ఇందుకోసం ప్రముఖ లిరిసిస్ట్ ఒకరు ఆయనకు సహాయం అందిస్తున్నారట.

తెలుగులోని ఏ యాసలో అయినా మాట్లాడగల నేర్పు పవన్ కు ఉంది. పైగా సీమ యాసలో పవన్ సినిమా చేయడం ఇదే తొలిసారి. ‘వకీల్ సాబ్’ సినిమాలో కూడ తెలంగాణ డిక్షన్ ట్రై చేసి మెప్పించారు. అంతేకాదు ఈ రీమేక్ సినిమాలో పవన్ ఒక పాట కూడ పాడనున్నారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ స్వయంగా తెలిపారు. పవన్ పాడుతున్నారు అంటే అది తప్పకుండా జానపద గీతమే అయ్యుంటుంది. మొత్తానికి పవన్ తన సినిమా ప్రేక్షకులకు వరుస సప్రైజెస్ ఇవ్వనున్నారన్నమాట. త్రివిక్రమ్ కథనం, మాటలు అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం వరకు పూర్తైంది.

Exit mobile version