రాత్రి ఈ జానర్ సినిమాలు ఇష్టపడతానంటున్న పవన్.!

రాత్రి ఈ జానర్ సినిమాలు ఇష్టపడతానంటున్న పవన్.!

Published on May 2, 2024 7:03 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ భారీ చిత్రం “హరిహర వీరమల్లు” నుంచి ఓ సాలిడ్ అప్డేట్ రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఒక పీరియాడిక్ జానర్ సినిమా కాగా ఈ జానర్ లో తను చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక దీనితో పాటుగా పవన్ టచ్ చేయని జానర్ లు కూడా చాలానే ఉన్నాయి.

అయితే అసలు పవన్ కి సినిమా పట్ల ఒక నటుడు గానే కాకుండా రచయిత గా, దర్శకుడు గా కూడా ఒక అభిరుచి ఉన్న సంగతి తెలిసిందే. అలా తను రాత్రి పడుకునే ముందు ఎలాంటి సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు అనేది లేటెస్ట్ గా నేషనల్ మీడియాకి ఇచ్చిన ఓ ర్యాపిడ్ ఫైర్ లో రివీల్ చేశారు.

తను రాత్రి పూట ఓ హారర్ సినిమా చూసేందుకు ప్రిఫర్ చేస్తాను అని చెప్పుకొచ్చారు. ఇదొక ఆశ్చర్యకర సమాధానం అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం తను వీరమల్లు పీరియాడిక్ జానర్ సహా ఓజి అనే సినిమా కూడా యాక్షన్ కం పీరియాడిక్ జానర్ లోనే అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ జానర్ సినిమాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు