
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న సరికొత్త సినిమాకు ‘సర్దార్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే పూణేలో పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభంకానుంది.
ఈ సినిమాకోసం గత కొన్ని వారాలుగా బెంగుళూరులో పవన్ కళ్యాణ్ కసరత్తులు చేస్తున్నాడు. క్లీన్ షేవ్ తో పవన్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గుంటాడని సమాచారం. అనీషా ఆంబ్రోస్ హీరోయిన్. బాబీ దర్శకుడు. వచ్చే ఏడు సంక్రాంతికిఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు.

