పవన్ తో అప్పుడు రామయ్య వస్తావయ్యా…ఇప్పుడు దేవర!

పవన్ తో అప్పుడు రామయ్య వస్తావయ్యా…ఇప్పుడు దేవర!

Published on Feb 16, 2024 10:44 PM IST

పవర్ స్టార్ పవన్ హీరోగా, డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజి మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రయిట్ మూవీ కావడం తో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ అత్తారింటికి దారేది చిత్రం ను రిలీజ్ చేసిన సెప్టెంబర్ 27 వ తేదీకి ఓజీ ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం ఏమిటంటే దేవర రిలీజ్.

అక్టోబర్ 11, 2013 న యంగ్ టైగర్ నటించిన రామయ్యా వస్తావయ్యా సినిమా రిలీజైంది. కేవలం పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీ రిలీజైన కొద్ది రోజుల గ్యాప్ తోనే ఇది రిలీజ్ అయ్యింది. ఇప్పుడు దేవర చిత్రం కూడా అక్టోబర్ 10 న రిలీజ్ కానుంది. దాదాపు సేమ్ గ్యాప్ తో వీరి సినిమాలు వస్తున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కుతున్నాయి. ఈ రెండు చిత్రాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు