వైరల్: అయోధ్య వద్ద పవన్ సెల్ఫీ!

వైరల్: అయోధ్య వద్ద పవన్ సెల్ఫీ!

Published on Jan 22, 2024 7:40 PM IST

అయోధ్య లో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకి దేశంలోని పలువురు ప్రముఖులు హాజరై, బాల రాముడు ను దర్శించుకున్నారు. సౌత్ నుండి సినీ పరిశ్రమకి చెందిన వారు కూడా హాజరు అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ రజనీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ ఈ మేరకు అయోధ్య రామ మందిరం వద్ద ఒక సెల్ఫీ దిగారు. అది ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో విపరీతం గా వైరల్ అవుతోంది. అంతేకాక ఈ వేడుక పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తనకి చాలా ఎమోషనల్ గా మారింది అని, ప్రాణ ప్రతిష్ట సమయం లో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అని అన్నారు. ఈ కార్యక్రమం భారతదేశాన్ని బలోపేతం చేసింది అని, ఏకం చేసింది అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు