పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ మరాఠీ సినిమా ‘ఇష్క్ వాలా లవ్’తో సిని రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ మాజీ భార్య, అకిరా నందన్ తల్లి రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అకిరా అతిధి పాత్రలో నటించాడు. తన కుమారుడి తొలి సినిమాకు దర్శకనిర్మాత కావడం పట్ల రేణు దేశాయ్ సంతోషం వ్యక్తం చేశారు.
‘ఇష్క్ వాలా లవ్’లో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్తున్నాడు అకిరా నందన్. ఈ విషయాన్ని రేణు దేశాయ్ ట్విట్టర్ లో తెలిపారు. ఫస్ట్ టైం అకిరా డబ్బింగ్ చెప్తున్నాడు. ప్రత్యేక పాత్రలో అకిరా నటించాడు. కేవలం ఒక సన్నివేశంలో మాత్రామే కనిపిస్తాడు అని రేణు దేశాయ్ ట్వీట్ చేశారు.
ఇటివల విడుదల చేసిన ‘ఇష్క్ వాలా లవ్’ ట్రైలర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో డబ్ చేస్తున్నారు. ప్రస్తుతం పాటల రికార్డింగ్ జరుగుతుంది. త్వరలో తెలుగు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.



