పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా తమిళంలోకి వెళ్లనుంది !

Published on Jul 30, 2018 4:44 pm IST


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ”అత్తారింటికి దారేది’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విడుదలకు ముందే ఫస్ట్ హాఫ్ మొత్తం లీక్ అయి సంచలనం అయినా ఈ చిత్రం, ఆ తర్వాత విడుదలై సంచలనాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలించింది.

తాజాగా సినీవర్గాల సమాచారాం ప్రకారం ”అత్తారింటికి దారేది’ చిత్రం త్వరలో తమిళ ప్రేక్షకులను కూడా అలరించనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎప్పటినుంచో తమిళంలో రీమేక్ చెయ్యాలనుకుంటున్నారు. కాగా తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్ర నిర్మత బివియన్ ప్రసాద్ దగ్గర నుండి తమిళ రీమేక్ రైట్స్ ను కొనుక్కున్నారు. దాంతో ఈ చిత్రంలో తమిళంలో ఏ స్టార్ హీరో నటిస్తాడా అని తమిళ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ చిత్రానికి సంబంధించి పూర్తీ వివరాలు త్వరలో తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం :