పవన్ మూవీ బడ్జెట్ భారీగా ..!

Published on Mar 13, 2020 9:23 am IST


పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా, క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ కూడా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. వకీల్ సాబ్ వేసవి కానుకగా మే నెలలో విడుదల కానుంది. కాగా క్రిష్ మూవీ కోసం నిర్మాతలు భారీగా ఖర్చుపెడుతున్నారట.

పవన్ కెరీర్ లో మొదటిసారి ఓ పీరియడ్ డ్రామాలో నటిస్తుండగా భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారట. మొఘలుల కాలం నాటి కథగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా పవన్ బందిపోటు పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. పీరియడ్ మూవీ కావడంతో సెట్స్ కొరకు భారీగా ఖర్చు అవుతుందట. ఇక పవన్ లాంటి స్టార్ హీరో తో చేస్తున్న మూవీ కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్ గా నిర్మిస్తున్నారట. ఈ చిత్రానికి నిర్మాతగా ఏ ఎమ్ రత్నం వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :