అయ్యప్పణం రీమేక్ లో పవన్ రోల్ మరింత ఆసక్తిగా.?

pawan rana
ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన రీమేక్ చిత్రం “వకీల్ సాబ్” విడుదలకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి అలాగే దీనితో పాటుగా మరో రీమేక్ చిత్రం కూడా పవన్ చేస్తున్నారు. అదే మళయాళ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పణం కోషియం”. టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రంపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి.

అలాగే ఇప్పటికే 40 శాతం షూట్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రంలో పవన్ రోల్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో తెలుస్తుంది. ఈ చిత్రంలో పవన్ రోల్ ను దర్శకుడు సాగర్ చంద్ర మరింత పొడిగించారట. అది కూడా పవన్ పై ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అన్నట్టు తెలుస్తుంది, ఒరిజినల్ వెర్షన్ లో లేని దాన్ని మేకర్స్ ఈ చిత్రానికి యాడ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version