పవన్ కళ్యాణ్ కు మాత్రమే ప్రత్యేకం, గంట సేపు ప్రసంగం !


నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న బోస్టన్ బయలుదేరి ఈరోజు సాయంత్రం 6 : 45 కు అక్కడకు చేరుకున్నారు. ఈ పర్యటన 9 నుంచి 12 వరకు ఐదు రోజుల పాటు జరగనుంది. తొమ్మిదో తేదీ ఉదయం 5 గంటలకు మొదలయ్యే ఈ పర్యటన 12 సాయంత్రం 6:30 కి ముగుస్తుంది. ఈ పర్యటనలో పవన్ న్యూక్లియర్ అండ్ యాంటీ న్యూక్లియర్ ప్రొఫెసర్ మాధ్యు బన్, ఎనర్జీ పాలసీ రూపకల్ప నిపుణుడు ప్రొఫెసర్ హెన్రీ లీలతో పాటు హ్యాంప్ షైర్ గవర్నర్, అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు వంటి పలువురు ముఖ్యులను కలుసుకుని చర్చలు జరుపుతారు.

ఇక చివరి రోజు 11న హార్వర్డ్ యూనివర్సిటీలో ‘బికమింగ్ జనసేనాని’ అనే అంశంపై మాట్లాడి 12న నోట్ ప్రసంగం ఇవ్వనున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే సాధారణంగా ఈ సమావేశంలో ఎవరికైనా కేవలం అరగంట సేపు మాత్రమే ప్రసంగించే అవకాశముంటుంది. కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం నిర్వాహకులు సుమారు గంట సేపు ప్రసంగించే ఛాన్స్ ఇచ్చారు. ఇకపోతే బోస్టన్ లో ఉన్న పవన్ అభిమానులు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు పవన్ ఏయే అంశాలను ప్రస్తావిస్తారు, ఏం మాట్లాడతారు అనే విషయాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version