ఈ భారీ సినిమాలో పవన్ నోటి పాట?

ఈ భారీ సినిమాలో పవన్ నోటి పాట?

Published on Jan 17, 2024 10:59 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ కొంతమేర కంప్లీట్ అయ్యి ఇప్పుడు బ్రేక్ లో ఉంది. ఇక ఈ భారీ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా విషయంలో సంగీత దర్శకుడు థమన్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.

ఈ చిత్రంలో మళ్ళీ చాలా కాలం తర్వాత పవన్ తన గానం అందించనున్నాడని తెలుపుతున్నాడు. సినిమాలో పవన్ నోట పాట రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయని సో పవన్ నుంచి అయితే ఈ సినిమాలో ఒక పాటని ఆశించవచ్చని చెప్పొచ్చు. మరి ఈ యాక్షన్ ప్రాజెక్ట్ లో అలాంటి స్కోప్ ఎక్కడ ఉందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వాలారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు