
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ ని ఇటీవలే స్టార్ట్ చేసాడు. షూటింగ్ మొదలు పెట్టిన పవన్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ ని చకచకా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్ర టీం హైదరబాద్ లో రెండు చేస్యూల్స్ ని పూర్తి చేసింది. ఇటీవలే నైట్ ఎఫెక్ట్ లో కొన్ని సీన్స్ షూట్ చేసిన ఈ చిత్ర టీం షూట్ కి చిన్న గ్యాప్ ఇచ్చింది. దానికి కారణం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య బర్త్ డే వేడుకలకి కాస్త సమయం కేటాయించడం అలాగే నిన్న ఆంధ్ర రైతుల భూసేకరణ సమస్యను పరిష్కరించడం కోసం వెళ్ళి రావడానికి కాస్త సమయం కేటాయించాడు. త్వరలోనే ఈ చిత్ర టీం మరో షెడ్యూల్ ని మొదలు పెట్టడానికి సిద్దమైంది.
సినిమా మొదలు పెట్టినప్పుడే ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసారు. దాంతో పవన్ కళ్యాణ్ తో పాటు ఈ చిత్ర టీం మొత్తం సినిమా షూటింగ్ ని స్పీడప్ చెయ్యాలని, ఇక నుంచి ఎలాంటి బ్రేక్ లేకుండా షూట్ చేసి జనవరి మిడ్ కల్లా సినిమా రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. హైదరాబాద్ న్యూ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ చిత్ర టీం కొన్ని మేజర్ ఎపిసోడ్స్ ని షూట్ చేయడం కోసం గుజరాత్ వెళ్లనుంది. తాజాగా పవన్ కళ్యాణ్ కి జోడీగా కాజల్ అగర్వాల్ ని ఫైనలైజ్ చేయగా మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. పవన్ కి పోటీ ఇచ్చే విలన్ గా మరాఠీ నటుడు శరత్ కేల్కర్ కనిపించనున్న ఈ సినిమాకి ‘పవర్’ సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ ఇప్పటికే కొన్ని ట్యూన్స్ ని కూడా కంపోజ్ చేసేసాడు.