జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన పవన్

PawanKalyan
తెలంగాణలో జరుగుతున్న మొదటి సార్వత్రిక ఎన్నికలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు అని భావించన పవన్ ఉదయాన్నే తన ఓటును వేసారు. పోలింగ్ బూత్ నుండి బయటకి వచ్చిన పవన్, ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించాలని పిలుపునిచారు.

హైదరాబాద్ తో సహా తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో ప్రభుత్వం ఈరోజు సెలవు ప్రకటించింది. ఇదిలా ఉంటే మిగతా సినీ ప్రముఖులు కూడా ఫిలిం నగర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

నందమూరి కుటుంబం ఖైరతాబాద్ లో ఓటు వేయనునట్టు సమాచారం.

Exit mobile version