“వీరమల్లు” లో మళ్ళీ పవన్ పాల్గొనేది అప్పుడే.?

“వీరమల్లు” లో మళ్ళీ పవన్ పాల్గొనేది అప్పుడే.?

Published on Mar 25, 2021 8:00 PM IST

Hari Hara Veera Mallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” విడుదలకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఇది పవన్ కం బ్యాక్ సినిమా అయినా కూడా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు” పై ఒకింత ఎక్కువ అంచనాలే ఉన్నాయి. ఇటీవల వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కి అయితే భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది.

అయితే ఈ చిత్రం షూటింగ్ మరియు అయ్యప్పణం కోషియం రీమేక్ సినిమా షూట్ కు బిజీ బిజీగా గడిపిన పవన్ ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకున్నట్టు ఉన్నారు. అయితే వీరమల్లు షూట్ కు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో వినిపిస్తుంది. ఈ సినిమా షూట్ వచ్చే మార్చ్ 27 నుంచి మళ్ళీ షురూ కానున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు