వకీల్ సాబ్ లేటుగా జాయిన్ అవుతారట..!

Published on May 26, 2020 8:45 am IST

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆయన వెండి తెరపై కనిపించి రెండేళ్లు దాటిపోయింది. పవన్ చివరి చిత్రం అజ్ఞాతవాసి 2018 సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. లాక్ డౌన్ లేకుంటే వకీల్ సాబ్ ఈ నెలలో థియేటర్స్ లో దిగేది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది అనుకుంటున్న తరుణంలో బ్రేక్ పడింది. ఒకవేళ మూవీ షూటింగ్ పూర్తి అయినా, థియేటర్స్ బంద్ కారణంగా విడుదల కానీ పరిస్థితి ఉంది.

కాగా కొద్దిరోజులలో వకీల్ సాబ్ షూటింగ్ తిరిగి మొదలుకానుంది. షూటింగ్ పునఃప్రారంభంకి ప్రభుత్వాలు ఒప్పుకోగా త్వరలో షూటింగ్స్ జరుగనున్నాయి. ఇక ఓ 30రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్న ఈ చిత్ర షూటింగ్ లో పవన్ కొంచెం లేటుగా జాయిన్ కానున్నారని సమాచారం. ఇదే విషయాన్ని నిర్మాత దిల్ రాజుకు పవన్ తెలియ పరచారట. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ లాయర్ రోల్ చేస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More