పవన్ మూవీ కోసం సెట్స్ వేయిస్తున్న నిర్మాత…?

పవన్ మూవీ కోసం సెట్స్ వేయిస్తున్న నిర్మాత…?

Published on Nov 5, 2019 12:23 PM IST

Pawan

పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు కారణంగా ఇక ఆయన పూర్తిగా చిత్రపరిశ్రమకు దూరం అవుతారని ప్రజా క్షేత్రంలోనే ఉంటారని అందరూ భావించారు.దీనితో ఆయన హీరోయిజం తెరపై చూసి మురిసిపోవాలనుకున్న కొందరు డై హార్డ్ అభిమానులు ఒకింత నిరాశ కూడా చెందారు. ఐతే తాజా పరిణామాలు ఆయన సినిమా చేయడం ఖాయం అని తెలుస్తుంది. కొన్ని మీడియా వర్గాల సమాచారం ప్రకారం నిర్మాత దిల్ రాజు అన్నపూర్ణ స్టూడియోలో కోర్ట్ రూమ్ సెట్ కొరకు ఏర్పాట్లు మొదలుపెట్టారట. దీనికోసం ఆయన అక్కడ కొంత స్థలాన్ని కూడా బుక్ చేసినట్లు సమాచారం.

మూడురోజులకు ముందు పవన్ కళ్యాణ్ హిందీ చిత్రం పింక్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారంటూ అధికారికంగా కొన్ని వార్తలు వచ్చాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బోనికపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ మూవీ నిర్మిస్తున్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు దిల్ రాజు కోర్ట్ సెట్ కొరకు స్టూడియోలో ఏర్పాట్లు చేస్తున్నారన్న వార్తలు పవన్ సినీ పునర్ ఆరంగేట్రాన్ని బలపరుస్తున్నట్లుగా ఉంది. ఇక పవన్ నిన్న మీడియా సమావేశంలో సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తే తప్పేంటీ అన్నట్లుగా మాట్లాడారు. కాబట్టి పవన్ మూవీ కొద్దిరోజులలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదని కొందరి వాదన.

తాజా వార్తలు