అధికారికంగా ప్రకటించకపోయినా పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న పింక్ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నుండి మొదలుపెట్టాలని, 25 రోజుల్లో పవన్ పార్ట్ కు సంబధించిన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయాలని దర్శకనిర్మతాలు ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక దిల్ రాజు, బోనికపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ను అందిస్తున్నాడు.
ఎప్పుడైతే తమన్ రొటీన్ పంథా వదిలి ‘తొలిప్రేమ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారో అప్పటి నుండి నిర్మాతల చూపు ఆయన మీదే పడింది. అన్నట్లు ఈ సినిమాలో మిగిలిన కీలకపాత్రలు అయిన ముగ్గురు అమ్మాయిల పాత్రల కోసం.. అంజలి, నివేదా థామస్ మరియు అనన్యలను తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.


