పవన్ ఈ సినిమా వాయిదా పడ్డట్టే ఇక.!

Published on Jan 27, 2021 1:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా కం బ్యాక్ ఇచ్చిన చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణుతో తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. మరి ఈ సినిమా ఇంకా లైన్ లో ఉండగానే విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో ఓ భారీ పీరియాడిక్ సినిమాను ప్లాన్ చేశారు. కానీ అది కాస్త షూటింగ్ ను మాత్రమే జరుపుకోగా చాలా మేర బ్యాలన్స్ ఉన్న నేపథ్యంలో పరిస్థితులు కూడా చాలానే మారిపోయాయి.

ఆలోపలే మరిన్ని ప్రాజెక్ట్ లను పవన్ ఓకే చేసేసాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా మాత్రం ఈ ఏడాది విడుదల రేస్ లో లేనట్టే అని చెప్పాలి. ఇప్పటికే వకీల్ సాబ్ విడుదలకు ఫిక్స్ కాగా మరో రీమేక్ చిత్రం సాగర్ చంద్రతో ప్లాన్ చేసింది కూడా ఈ ఏడాదే విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. సో అఫీషియల్ గా క్రిష్ తో ప్లాన్ చేసిన చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడ్డట్టే అని చెప్పాలి. మరి ఈ సినిమా విషయంలో ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :