ఆ బయోపిక్ లో పోలీస్ గా బోల్డ్ హీరోయిన్ !

ఆ బయోపిక్ లో పోలీస్ గా బోల్డ్ హీరోయిన్ !

Published on Jul 2, 2019 11:01 AM IST

‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ఈ బయోపిక్ లో సెన్సేషన్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఆమె వేశ్య పాత్రలో నటిస్తోందని మొన్నటి వరకూ రూమర్స్ వచ్చాయి. కానీ ఆమె ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తోందట. అయితే పోలీస్ పాత్ర అయినప్పటికీ పాయల్ క్యారెక్టర్ కాస్త బోల్డ్ గానే ఉంటుందని సమాచారం.

ఇక వచ్చే నెల నుండి స్టూవర్టుపురం పరిసర ప్రాంతాల్లో ఈ బయోపిక్ కు సంబంధించి కీలక సన్నివేశాలను షూట్ చెయ్యనున్నారు. ఈ ‘టైగర్ నాగేశ్వర్రావు’ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు, అయితే 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు. మరి అలాంటి బయోపిక్ అంటే అప్పటి విషయాలు బాగానే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. అలాగే రేణు దేశాయ్ ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ అక్కగా కనిపించనున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు