ఆర్ ఎక్స్ 100 భామ మరోమారు హాట్ గా…!

Published on Aug 3, 2019 12:58 pm IST

మొదటి చిత్రం “ఆర్ ఎక్స్ 100” లో బోల్డ్ క్యారెక్టర్ చేసిన పాయల్ రాజ్ పుత్ ఆ చిత్రం ఊహించని ఘనవిజయం సాధించడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. కార్తికేయ హీరోగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన “ఆర్ ఎక్స్ 100 చిత్రం”లో పాయల్ కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసి మెప్పించింది. శారీరక సుఖంకోసం ఒక అబ్బాయిని ప్రేమ పేరుతో మోసం చేసే అమ్మాయిగా పాయల్ అద్భుతంగా నటించింది.

కాగా తాజాగా ఆమె నటిస్తున్న “ఆర్డీఎక్స్ లవ్” చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని హీరో వెంకటేష్ లాంచ్ చేయడం జరిగింది.ఆ పోస్టర్ లో పాయల్ లుక్ చుస్తే మరో మారు బోల్డ్ కంటెంట్ స్టోరీలో ఆమె నటించనుందా అనే అనుమానం కలుగుతుంది. యంగ్ డైరెక్టర్ శంకర్ భాను తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హ్యాపీ మూవీస్, సి కె ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :