పాయల్ ఆ పాత్ర చేయడానికి ఇన్స్పిరేషన్ విజయ శాంతి అట..!

Published on Mar 6, 2020 7:58 pm IST

కెరీర్ బిగినింగ్ నుండి గ్లామర్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ఎక్కువగా అలాంటి రోల్స్ చేస్తూ వచ్చింది. ఈ మధ్య విడుదలైన డిస్కో రాజా సినిమాలో తన ఇమేజ్ కి భిన్నంగా పెరఫార్మెన్సు కి స్కోప్ ఉన్న పాత్ర చేసింది. ఇక తాజా చిత్రం 5Wస్ లో ఆమె ఓ పోలీస్ అధికారిని పాత్ర చేస్తుంది. ఈ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది.

ఓ సీరియస్ మర్డర్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం కనిపిస్తూ ఉండగా, ఆ కేసుని ఛేదించే సీరియస్ కాప్ గా పాయల్ నటిస్తుంది. కాగా ఈ పోలీస్ పాత్రకు తనకు ప్రేరణ స్ఫూర్తి ఇచ్చింది లేడీ అమితాబ్ గా పేరున్న విజయశాంతి అని ఆమె చెప్పారు. ఆ పాత్ర కోసం పాయల్ విజయ శాంతి పోలీస్ గా నటించిన సినిమాలను చూశారట. విజయశాంతి అనేక చిత్రాలలో పోలీస్ పాత్ర చేయగా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన కర్తవ్యం సినిమాకు ఆమె నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. ఇక 5wస్ చిత్రానికి ప్రాణ దీప్ ఠాకూర్ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More