150 మిలియన్ కొట్టేసిన చికిరి.. నెక్స్ట్ సాంగ్ పై క్రేజీ బజ్!

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం పెద్ది (Peddi) కోసం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి సాంగ్ చికిరి చికిరి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇదే రెస్పాన్స్ తో తెలుగు వెర్షన్ సాంగ్ భారీ రీచ్ తో 150 మిలియన్ వ్యూస్ ని దాటేసింది. ఇక ఈ సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి క్రేజీ బజ్ వినిపిస్తోంది.

ఈ సాంగ్ పై ఓ క్లారిటీ నెలాఖరుకి రానున్నట్టు తెలుస్తుంది. ఇది సాలిడ్ మాస్ నెంబర్ అని ఆల్రెడీ తెలిసిందే. ఇక దీనితో పాటుగా ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుంది అని దానికి మృణాల్ ఠాకూర్ కావాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. కానీ అది మృణాల్ ఠాకూరా కాదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఓ స్టార్ హీరోయిన్ నే ఉండొచ్చని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version